LOADING...
Kerala: కేరళకు కొత్త పేరు..? 'కేరళమ్‌'కు ఆమోదం తెలపనున్న కేంద్ర క్యాబినెట్‌..!
కేరళకు కొత్త పేరు..? 'కేరళమ్‌'కు ఆమోదం తెలపనున్న కేంద్ర క్యాబినెట్‌..!

Kerala: కేరళకు కొత్త పేరు..? 'కేరళమ్‌'కు ఆమోదం తెలపనున్న కేంద్ర క్యాబినెట్‌..!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2026
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ రాష్ట్రం పేరు అధికారికంగా "కేరళమ్‌ (Keralam)"గా మార్చే అంశం మరోసారి చర్చకు వచ్చింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ నుంచి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ పేరుమార్పు విషయంలో కేంద్రాన్ని కోరుతూ కేరళ అసెంబ్లీ ఇప్పటికే పలుమార్లు తీర్మానాలు ఆమోదించింది. ఈ క్రమంలో త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని పరిశీలించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు 

పూర్వం నుంచే "కేరళమ్‌"

పేరు మార్పు విషయంపై 2023లో రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం ఆమోదించింది. తమ రాష్ట్రాన్ని మలయాళ భాషలో పూర్వం నుంచే "కేరళమ్‌"గా పిలుస్తున్నారని ఆ సమయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. అయితే ఇతర భాషల్లో మాత్రం "కేరళ" అనే పేరే ప్రాచుర్యంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై విజయన్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ముఖ్యమంత్రికి లేఖ రాసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. దీనికి ప్రతిస్పందించిన సీఎం,"రాష్ట్ర అసలు పేరు కేరళమ్‌.బ్రిటిష్ పాలకులు తమ సౌకర్యార్థం 'కేరళ'గా మార్చారు.ఇప్పుడు ఆ మార్పులను రాష్ట్ర సంస్కృతి,భాషా పరమైన స్వరూపానికి అనుగుణంగా సవరించే ప్రయత్నం చేస్తున్నాం" అని వివరించారు.

వివరాలు 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం సవరణ 

కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించిన వెంటనే రాజ్యాంగ పరమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర పేరును అధికారికంగా "కేరళమ్‌"గా సవరించాల్సి ఉంటుంది. అదేవిధంగా, రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న అన్ని భాషల్లోనూ అవసరమైన మార్పులు చేయాల్సి ఉంటుంది.

Advertisement