Page Loader
రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 
రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 

వ్రాసిన వారు Stalin
Jun 07, 2023
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో చర్చలు జరిపేందుకు కేంద్రం సుముఖంగా ఉందని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. రెజ్లర్లు మరోసారి చర్చలకు రావాలని ట్విట్టర్‌లో అనురాగ్ ఠాకూర్ నిరసనకారులకు పిలుపునిచ్చారు. వారి సమస్యలను వినేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని పేర్కొన్నారు. రెజ్లర్లకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వం బ్రిజ్ భూషణ్ సింగ్‌ను రక్షించడం లేదని ఠాకూర్ చెప్పారు. న్యాయమైన విచారణ జరగాలని భారత ప్రభుత్వం కోరుకుంటుందని, దీని నుంచి ప్రభుత్వం ఎప్పటికీ వెనక్కి తగ్గదని ఠాకూర్ చెప్పారు. అయితే రెజ్లర్లు క్రీడా మంత్రి పిలుపు మేరకు చర్చలకు వెళ్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన ట్వీట్