Page Loader
Kumaraswamy: విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయం.. ప్లాంట్‌ను పునర్‌నిర్మిస్తాం: కుమారస్వామి
విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయం.. ప్లాంట్‌ను పునర్‌నిర్మిస్తాం: కుమారస్వామి

Kumaraswamy: విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయం.. ప్లాంట్‌ను పునర్‌నిర్మిస్తాం: కుమారస్వామి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని, దాన్ని పునఃనిర్మించనున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి (Kumaraswamy) తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో వేర్వేరుగా ఆయన భేటీ అయ్యారు. అనంతరం, మరో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీలు భరత్, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. "విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు.పరిశ్రమ ప్రారంభంలో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2013-14 వరకు ఉక్కు పరిశ్రమ పనితీరు చాలా బాగుంది.

వివరాలు 

ప్లాంట్‌కు రూ. 35వేల కోట్ల అప్పు 

2014లో నవరత్న హోదా సాధించిన తర్వాత ఉక్కు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించినప్పటి నుంచి ఈ పరిశ్రమ నష్టాల్లోకి వెళ్లింది. విశాఖ ఉక్కు పరిశ్రమ దుస్థితి గురించి ఏపీ ఎంపీలు వివరిస్తూ, ఆ సమస్యలను కేంద్రానికి తెలియజేశారు. కేంద్ర మంత్రి అయ్యాక స్టీల్ ప్లాంట్‌పై ఎన్నో సమీక్షలు చేశాను.2021లో విశాఖ ఉక్కు పరిశ్రమకు పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిపాదించాం. ప్రస్తుతం ఈ ప్లాంట్‌కు రూ. 35వేల కోట్ల అప్పు ఉంది.2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యాన్ని ప్రధాని మోదీ నిర్దేశించారు. ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో మనం ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్నాం.కార్మికుల సమస్యలను మూడు నెలల్లో పరిష్కరిస్తాం" అని కేంద్ర మంత్రి తెలిపారు.