LOADING...
బిహార్: ఎల్‌జేపీ నేతను కాల్చి చంపిన దుండగులు 
బిహార్: ఎల్‌జేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

బిహార్: ఎల్‌జేపీ నేతను కాల్చి చంపిన దుండగులు 

వ్రాసిన వారు Stalin
Sep 27, 2023
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లోని గయాలో లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) నాయకుడు అన్వర్ ఖాన్‌ను పట్టపగలు దుండగులు కాల్చి చంపారు. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అన్వర్ ఖాన్ ఎల్‌జేపీ పశుపతి కుమార్ పారస్ వర్గానికి చెందిన నాయకుడు. ప్రస్తుతం ఆయన ఎల్‌జేపీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అన్వర్ ఖాన్ సెలూన్‌లో ఉండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలకు గురి చేసింది. తుపాకీ శబ్ధం విన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. దుకాణాదారులు షాపులను మూసివేశారు. అన్వర్ ఖాన్‌ హత్యను నిరసిస్తూ ఆయన మద్దతుదారులు, కుటుంబ సభ్యులు 82వ జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెలూన్‌లో ఉండగా పట్టపగలు కాల్పులు