UP Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. 8మంది సజీవదహనం
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని భోజిపుర సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. బరేలీ-నైనిటాల్ హైవేపై శనివారం రాత్రి ట్రక్కును ఢీకొన్న తర్వాత కారులో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న 8మంది సజీవదహనం అయ్యారు. చనిపోయిన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది.
వివాహానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిదింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి కారులోంచి మృతదేహాలను వెలికితీశారు.
ప్రమాద స్థలానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కారు మంటల్లో చిక్కున్న సమయంలో సెంట్రల్ లాక్‌లో పడినందున అందులో ఉన్న వారు బయటికి రాలేకపోయారని, అందుకే అందరూ చనిపోయారని పోలీసులు తెలిపారు.
ప్రమాదం
కారు టైరు పగిలిపోవడంతో ప్రమాదం
కారు కాలిపోతున్నట్లు దృశ్యాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది.
వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అయితే అప్పటికే అందులో ఉన్న ప్రయాణికులంతా సజీవదహనమయ్యారు.
కారు టైరు పగిలిపోవడంతో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగాయి.
కారుకు సెంట్రల్ లాక్ ఉండడంతో అందరూ అందులో ఇరుక్కుపోయారని బరేలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుశీల్ చంద్ర భాన్ ధులే తెలిపారు.
సెంట్రల్‌గా లాక్ కారణంగా లోపల ఉన్న వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు.