Page Loader
ఉత్తర్‌ప్రదేశ్‌లో రౌడీ షీటర్ గుఫ్రాన్ కాల్చివేత 
ఉత్తర్‌ప్రదేశ్‌లో రౌడీ షీటర్ గుఫ్రాన్ కాల్చివేత

ఉత్తర్‌ప్రదేశ్‌లో రౌడీ షీటర్ గుఫ్రాన్ కాల్చివేత 

వ్రాసిన వారు Stalin
Jun 27, 2023
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గుఫ్రాన్ హతమయ్యాడు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్)తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుఫ్రాన్ హతమైనట్లు పోలీసులు తెలిపారు. కౌశాంబిలో మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో గుఫ్రాన్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గుఫ్రాన్ అనేక హత్య, దోపిడీ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. ప్రతాప్‌గఢ్, సుల్తాన్‌పూర్‌లో గుఫ్రాన్‌పై హత్య, దోపిడీ కేసులు 13కి పైగా నమోదయ్యాయి. ప్రయాగ్‌రాజ్, సుల్తాన్‌పూర్ పోలీసులు గుఫ్రాన్‌పై రూ.1,25,000 రివార్డు ప్రకటించారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు 10,900 ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. అందులో 185 మందికి పైగా నేరస్థులు మరణించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలోని దృశ్యాలు