LOADING...
UP double murder: తల్లిని వేధిస్తున్నారని, తండ్రి, తాతను చంపిన యువకుడు 
తల్లిని వేధిస్తున్నారని, తండ్రి, తాతను చంపిన యువకుడు

UP double murder: తల్లిని వేధిస్తున్నారని, తండ్రి, తాతను చంపిన యువకుడు 

వ్రాసిన వారు Stalin
Sep 11, 2023
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని దన్‌కౌర్‌లో జంట హత్యలు కలకలం రేపాయి. 21ఏళ్ల యువకుడు తన తండ్రి, తాతలను గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన జాస్మిన్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి జరిగిన ఈ జంట హత్యల వివరాలు ఇలా ఉన్నాయి. దన్‌కౌర్‌లోని బల్లు ఖేరా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఫిల్మ్ స్టూడియోలో జాస్మిన్ తన తండ్రి విక్రమజిత్ రావు, తాత రామ్‌కుమార్‌ను హత్య చేశారు. వారు నిద్రిస్తున్న సమయంలో హత్యలు చేసినట్లు జాస్మిన్‌ ఒప్పుకున్నాడు. తన తల్లిని తండ్రి, తాత చిత్రహింసలకు గురి చేశారని జాస్మిన్ పోలీసులు చెప్పాడు.

యూపీ

నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు

ప్రస్తుతం జాస్మిన్ తల్లిదండ్రులు విడిగానే ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరు విడాకుల కోసం కూడా దరఖాస్తు చేస్తున్నట్లు వెల్లడించారు. దూరంగా ఉంటూ కూడా తన తల్లిని వేదిస్తున్నారన్న కోపంతో తన తండ్రి, తాత ఉంటున్న ప్రదేశానికి వెళ్లి జాస్మిన్ హత్య చేశాడు. హత్యకు జాస్మిన్ గొడ్డలిని ఉపయోగించాడు. అలాగే సుత్తితో ఇద్దరి తలలపై బలంగా మోదాడు. హత్య తర్వాత రెండు ఆయుధాలను పక్కన మూసి ఉన్న బాత్ రూమ్‌లో పడేసి వెళ్లిపోయాడు. ఈ రెండు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు గ్రేటర్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) అశోక్ కుమార్ తెలిపారు.