LOADING...
Congress: కాంగ్రెస్‌లో కలకలం.. రాహుల్ గాంధీకి సీనియర్ నేతల షాక్
కాంగ్రెస్‌లో కలకలం.. రాహుల్ గాంధీకి సీనియర్ నేతల షాక్

Congress: కాంగ్రెస్‌లో కలకలం.. రాహుల్ గాంధీకి సీనియర్ నేతల షాక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2026
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, దేశంలో ఎల్పీజీ సరఫరా అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పై వరుసగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చెందిన పలువురు సీనియర్ నేతలు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా యుద్ధ అంశంలో సొంత పార్టీ నేతలే రాహుల్ అభిప్రాయాలకు భిన్నంగా స్పందించడం గమనార్హం. దీనిపై భాజపా తీవ్రంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. రాహుల్ గాంధీ అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిణామాలపై పలుమార్లు స్పందిస్తూ, విదేశాంగ విధానంలో ప్రధాని రాజీ పడ్డారంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. అయితే కాంగ్రెస్‌లోని ఇతర సీనియర్ నేతలు మాత్రం విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

వివరాలు

కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకున్న కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, విదేశాంగ విధానంలో కేంద్రం బాధ్యతాయుతమైన రాజనీతిని ప్రదర్శించిందని అభిప్రాయపడ్డారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై పడకముందే భారత్ దౌత్యపరంగా సమర్థంగా వ్యవహరించింది. పరిణతి చెందిన ఆలోచన, నైపుణ్యంతో కూడిన చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్పందిస్తూ దేశంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ కొరత లేదు. ప్రజల్లో కొరత ఉందన్న భయంతోనే సరఫరా ఆలస్యమవుతోందని తెలిపారు. మరో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తెవారి కూడా ఒక ఇంటర్వ్యూలో కేంద్రం యుద్ధంపై సరైన నిర్ణయాలే తీసుకుంటోందని చెప్పారు.

వివరాలు

బీజేపీ కౌంటర్

కాంగ్రెస్ నేతల ఈ వ్యాఖ్యలపై భాజపా స్పందిస్తూ ఘాటు విమర్శలు చేసింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, దేశంలో ఇంధన కొరత లేదని ప్రతిపక్షంలోని సీనియర్ నేతలే అంగీకరించారు. కానీ కాంగ్రెస్ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో భయాన్ని సృష్టిస్తోంది. ఇలాంటి చర్యలు ఆపాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆయన అవకాశవాది. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. అందుకే ఆయనను కాంగ్రెస్‌లోనే పలువురు నాయకులు వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement