Page Loader
Mahatma Gandhi : మహాత్మా గాంధీ విగ్రహాం తొలగింపు.. అస్సాంలోని డూమ్‌డూమా లో ఘటన
Mahatma Gandhi : మహాత్మా గాంధీ విగ్రహాం తొలగింపు.. అస్సాంలోని డూమ్‌డూమా లో ఘటన

Mahatma Gandhi : మహాత్మా గాంధీ విగ్రహాం తొలగింపు.. అస్సాంలోని డూమ్‌డూమా లో ఘటన

వ్రాసిన వారు Stalin
Jul 12, 2024
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెండు రోజుల క్రితం అస్సాంలోని తిన్‌సుకియా జిల్లాలోని డూమ్‌డూమా పట్టణంలో క్లాక్ టవర్ నిర్మాణానికి మార్గం కల్పించేందుకు 5.5 అడుగుల ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించారు. దీంతో వివాదంలో చెలరేగింది. దీనిపై మాజీ ఎమ్మెల్యే దుర్గా భూమిజ్, విగ్రహం తరలింపుపై నిరసనకు నాయకత్వం వహించారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఈ విగ్రహాన్ని తొలగించామని ప్రభుత్వం చెపుతోంది. ఈ ప్రజా నిరసనను చూసిన బిజెపి ఎమ్మెల్యే రూపేష్ గోవాలా, మహాత్మా గాంధీ విగ్రహాన్ని త్వరలో పునర్ నిర్మిస్తామని హామీనిచ్చారు.

వివరాలు 

తనకు తెలియదన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశ్ శర్మ 

గాంధీ చౌక్‌లో చాలా కాలంగా ఉన్నఈ విగ్రహాన్ని బుధవారం క్రేన్ ఉపయోగించి తొలగించారు. ఇది స్థానిక నివాసితుల నుండి నిరసనలకు దారితీసింది.కాగా, విగ్రహాన్ని తొలగించాలనే నిర్ణయం తనకు తెలియదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశ్ శర్మ అన్నారు. "జిల్లా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం పై అవగహన లేదు. అస్సాం మహాత్మా గాంధీ కి చాలా రుణపడి ఉంది. నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అస్సాంను పాకిస్తాన్‌లో చేర్చాలని కోరినప్పుడు ఆయన గోపీనాథ్ బోర్డోలోయ్‌కు అండగా నిలిచారు. గ్రూపింగ్ ప్లాన్," అని ఆయన X లో చెప్పారు.