UPSC CSE 2025 Results: UPSC సివిల్స్ 2025 తుది ఫలితాలు విడుదల.. అనూజ్ అగ్నిహోత్రికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్
ఈ వార్తాకథనం ఏంటి
అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు సంబంధించి యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) 2025 తుది ఫలితాలను అధికారులు విడుదల చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 958 మందిని వివిధ కేంద్ర సర్వీసులకు ఎంపిక చేశారు. ఇందులో జనరల్ కేటగిరీ నుంచి 317 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి 104 మంది, ఓబీసీ నుంచి 306 మంది, ఎస్సీ కేటగిరీ నుంచి 158 మంది, ఎస్టీ కేటగిరీ నుంచి 73 మంది ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో అనూజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు సాధించి ప్రతిభ చాటాడు. అలాగే పలువురు తెలుగు విద్యార్థులు కూడా సివిల్స్‌లో మంచి ర్యాంకులు సాధించి మెరిశారు.
వివరాలు
టాప్ 10 ర్యాంకర్లు వీరే..
అనూజ్ అగ్నిహోత్రి, రాజేశ్వరి సువే, అకాన్ష్ ధుల్, రాఘవ్ ఝున్‌ఝున్‌వాలా, ఇషాన్ భట్నాగర్, జినియా అరోడా, ఏఆర్ రజా, మొహియిద్దీన్. పక్షల్ సెక్రటరీ, అస్థా జైన్, ఉజ్వల్ ప్రియాంక్ సివిల్స్‌లో ప్రతిభ చాటిన తెలుగు విద్యార్థులు వీరే.. సివిల్స్ తుది ఫలితాల్లో పలువురు తెలుగు విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. జాతీయ స్థాయిలో సృజన 55వ ర్యాంకు సాధించగా, డీఎస్‌కే ప్రచేత్ 193వ ర్యాంకు దక్కించుకున్నారు. ఎస్ వర్షిత్ రెడ్డి 259వ ర్యాంకు, ఎం. పవన్ కుమార్ రెడ్డి 297వ ర్యాంకు, వెలిమినేటి విక్రమసింహారెడ్డి 541వ ర్యాంకు సాధించారు. అలాగే గుమ్మల శ్వేత 573వ ర్యాంకు, పల్లి ప్రమోద్ విష్ణు 640వ ర్యాంకు, గుమ్మల విజయసింహారెడ్డి 682వ ర్యాంకు పొందారు.
వివరాలు
సివిల్స్‌లో ప్రతిభ చాటిన తెలుగు విద్యార్థులు వీరే..
పోతుపురెడ్డి భార్గవ్ 738వ ర్యాంకు, పుడారి రాహుల్ 748వ ర్యాంకు, కుమ్మరి శ్రవణ్ కుమార్ 768వ ర్యాంకు సాధించారు. అదేవిధంగా అనిరుధ్ కత్తిమాని 786వ ర్యాంకు, కోరపోతుల శ్రీకర్ రాజు 806వ ర్యాంకు, ఇస్లావత్ శ్రీరామ్ హర్ష 823వ ర్యాంకు పొందారు. కట్టా ప్రత్యూష 908వ ర్యాంకు, గోగుల రాజశేఖర్ 920వ ర్యాంకు, గుగులోతు జితేందర్ నాయక్ 939వ ర్యాంకులతో తమ ప్రతిభను చాటుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి కీలక పోస్టుల భర్తీ కోసం యూపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
వివరాలు
ఆగస్టు 22 నుంచి 31 వరకు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష
దేశవ్యాప్తంగా గత సంవత్సరం మే 25న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆగస్టు 22 నుంచి 31 వరకు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షను నిర్వహించారు. మెయిన్స్‌లో మంచి ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు గత ఏడాది డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు దశలవారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి, తాజాగా తుది ఫలితాలను ప్రకటించారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి