Jaishankar: ఇరాన్ యుద్ధ నౌకపై యూఎస్ దాడి.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంక తీర ప్రాంతంలో ఇరాన్ కు చెందిన యుద్ధ నౌక IRIS Denaపై యూఎస్ జలాంతర్గామి దాడి చేసి దానిని ముంచేసిన ఘటన తెలిసిందే. ఈ ఘటనపై సుబ్రహ్మణ్యం జైశంకర్ స్పందించారు. ఇటీవల విశాఖపట్టణంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు పాల్గొనేందుకు వచ్చిన పలు ఇరాన్ యుద్ధ నౌకలు అనుకోని విధంగా యుద్ధ ప్రభావానికి గురయ్యాయని ఆయన తెలిపారు. అవి స్వయంగా యుద్ధంలో పాల్గొనే ఉద్దేశంతో రాకపోయినా, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. అదే సమయంలో IRIS లావన్ అనే మరో నౌక తిరిగి వెళ్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తిందని జైశంకర్ వెల్లడించారు.
Details
కొచ్చిలో నిలిపేందుకు అనుమతి ఇవ్వాలి
దీంతో ఆ నౌకను అత్యవసరంగా నిలిపేందుకు ఇరాన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, కొచ్చిలో నిలిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరిందన్నారు. ఈ విషయంలో కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ, మానవతా దృక్పథంతో ఇండియా ఈ నెల 1న సంబంధిత అనుమతి మంజూరు చేసిందని ఆయన తెలిపారు. అనంతరం ఈ నెల 4న ఆ నౌక కొచ్చిలో నిలిచిందని వెల్లడించారు. నౌకలో ఉన్న 183 మంది సిబ్బందికి కొచ్చిలోనే ఆశ్రయం కల్పించినట్లు కూడా ఆయన చెప్పారు. భారత్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని జైశంకర్ పేర్కొన్నారు. ఇక శ్రీలంక తీరంలో దాడి జరిగిన వెంటనే ఐరిస్ దేనా నౌక నుంచి మొదటగా ప్రమాద హెచ్చరిక శ్రీలంక నేవీకి వెళ్లిందని తెలిపారు.