LOADING...
LPG vessel: భారత్‌కు చేరిన అమెరికా ఎల్‌పీజీ నౌక.. ఇంధన సంక్షోభానికి ఊరట
భారత్‌కు చేరిన అమెరికా ఎల్‌పీజీ నౌక.. ఇంధన సంక్షోభానికి ఊరట

LPG vessel: భారత్‌కు చేరిన అమెరికా ఎల్‌పీజీ నౌక.. ఇంధన సంక్షోభానికి ఊరట

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చమురు, ఎల్‌పీజీ సరఫరా గొలుసుల్లో అంతరాయం ఏర్పడడంతో భారత్‌లో ముఖ్యంగా ఎల్‌పీజీ కొరత తలెత్తింది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. యూఎస్‌కు చెందిన ఎల్‌పీజీ నౌక భారత్‌కు చేరుకుంది. అమెరికాలోని టెక్సాస్‌ నుంచి బయల్దేరిన 'పయనీర్‌' నౌక భారీ ఎల్‌పీజీ లోడ్‌తో ఆదివారం కర్ణాటకలోని మంగళూరు పోర్ట్‌ను చేరుకుంది. ఇదే సమయంలో రష్యాకు చెందిన చమురు నౌక కూడా భారత జలాల్లోకి ప్రవేశించింది.

Details

మంగళూరు పోర్టుకు నౌక

'అక్వాటైటాన్‌' పేరుతో వచ్చిన ఈ నౌక శనివారమే మంగళూరు పోర్టుకు చేరినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా తలెత్తిన ఇంధన కొరతను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 12 నాటికి రష్యా నౌకల్లో లోడ్ చేసిన చమురును కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడం గమనార్హం. ఈ నిర్ణయంతో రష్యా నుంచి ఇంధన సరఫరా మళ్లీ ప్రారంభమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం భారత్‌లో ఇంధన కొరతను తగ్గించడంలో కీలకంగా మారే అవకాశం ఉంది.

Advertisement