Page Loader
దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం 
దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం

దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం 

వ్రాసిన వారు Stalin
Apr 13, 2023
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

దొంగతనం చేశాడనే అనుమానంతో 32 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కొట్టారు. అనంతరం అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో బయట పడేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగింది. శివమ్ జోహ్రీ (32) రవాణా వ్యాపారి బంకిమ్ సూరి వద్ద ఏడేళ్లుగా మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్ పోర్టు కార్యాలయంలో మంగళవారం ప్రముఖ వ్యాపార సంస్థకు చెందిన కన్హియా హోజరీ పార్సిల్ కనిపించకుండా పోయింది. దొంగతనం చేశారనే అనుమానంతో యజమాని శివమ్ జోహ్రీపై దాడికి ఆదేశించాడు. దీంతో ట్రాన్స్ పోర్టు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు శివమ్ జోహ్రీపై ఇనుప రాడ్లతో దాడి చేశారు.

యూపీ

పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరింత సమాచారం

ట్రాన్స్ పోర్టు కార్యాలయ ఉద్యోగులు శివమ్ జోహ్రీపై దాడి చేస్తున్నప్పుడు రికార్డయిన వీడియో వైరల్‌గా మారింది. ఆ దెబ్బలకు తట్టుకోలేక శివమ్ జోహ్రీ అరుస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనపడుతాయి. దెబ్బలు తాళలేక చనిపోయిన శివమ్ మృతదేహాన్ని మంగళవారం రాత్రి ప్రభుత్వాస్పత్రిలో వదిలేసి వెళ్లియారు. అయితే కుటుంబ సభ్యులు విద్యుదాఘాతంతో మరణించినట్లు పోలీసులకు చెప్పారు. శివమ్ మృతదేహాంపై గాయాలను చూసిన పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తును ప్రారంభించారు. విచారణలో అంతకుముందు జరిగిన తతంగం అంతా తెలిసిందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేగానీ, మరింత సమాచారం తెలుస్తుందని వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శివమ్ జోహ్రీని కొడుతున్న దృశ్యాలు