Cough Syrup: ఉత్తర్‌ప్రదేశ్ దగ్గు సిరప్ కేసు.. 25 చోట్ల ఈడీ దాడులు.. పరారీలో ప్రధాన నిందితుడు
ఈ వార్తాకథనం ఏంటి
రెండు రోజుల ముందు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కోడైన్ ఆధారిత కాఫ్ సిరప్ అక్రమ అమ్మకం, నిల్వ, వ్యాపారంపై విచారణ జరపడానికి ఒక ఐజీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో మూడు సభ్యుల హై-లెవల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని ఏర్పాటు చేసిన తరువాత, శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఈ దాడులు ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్ లోని అనేక ప్రదేశాలను కవర్ చేశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్, అతని సహచరులు అలోక్ సింగ్, అమిత్ సింగ్, ఇతర కాఫ్ సిరప్ తయారీదారులు, CA విష్ణు అగర్వాల్ పరారీలో ఉన్నారు. వీరు అక్రమంగా కాఫ్ సిరప్ సరఫరా చేసి వ్యాపారం చేసారని ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
ఉత్తర్‌ప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో 30 కి పైగా FIRలు..
లక్నో,వారణాసి,జౌన్‌పూర్, సాహరన్‌పూర్,రాంఛీ,అహ్మదాబాద్ వంటి 25 ప్రాంతాల్లో ED సోదాలు ప్రారంభించి,ఉదయం 7:30 గంటలకు ప్రాంగణంలోనికి ప్రవేశించింది. కేసులో ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్ దొరక్కపోవడం వల్ల, అతను దుబాయ్‌లో ఉన్నాడని అనుమానిస్తున్నారు. అతని తండ్రి భోళా ప్రసాద్ సహా ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్ 32 మందిని అరెస్ట్ చేసింది. ఈ కేసు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ఆధారంగా దొరికింది, ఇది ED అంతర్గత డాక్యుమెంట్. గత రెండు నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో 30 కి పైగా FIRలు నమోదు అయినాయని, వాటి ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు ED తెలిపింది.