Page Loader
Uttarakhand: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 5 ఏజెన్సీల ఉమ్మడి ఆపరేషన్ 
Uttarakhand: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 5 ఏజెన్సీల ఉమ్మడి ఆపరేషన్

Uttarakhand: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 5 ఏజెన్సీల ఉమ్మడి ఆపరేషన్ 

వ్రాసిన వారు Stalin
Nov 20, 2023
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన సొరంగంలో చిక్కుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఐదు ప్లాన్స్‌ను రెడీ చేసిన కేంద్రం.. ఆ ప్లాన్స్‌ను అమలు చేసే బాధ్యతలను 5 కేంద్ర ఏజెన్సీలకు అప్పగించినట్లు రవాణా, రహదారుల కార్యదర్శి అనురాగ్ జైన్ వెల్లడించారు. అయితే ఐదు ప్లాన్స్‌ను అమలు చేసే బాధ్యతను అప్పగించిన కేంద్ర ఏజెన్సీల వివరాలు ఇవే.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ (ఎస్‌జేవీఎన్ఎల్) రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్ఎల్) జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఐ‌డీసీఎల్) తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీహెచ్‌డీసీఎల్)

ఉత్తరాఖండ్

ఏ బాధ్యతలు ఎవరికి అప్పగించారంటే.. 

1.కార్మికులను రక్షించేందుకు సొరంగం పైనుంచి నిలువుగా డ్రిల్లింగ్‌ చేసే బాధ్యతను 'ఎస్‌జేవీఎన్ఎల్'కు అప్పగించారు. 2 బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఒక అప్రోచ్ రోడ్డును ఒక్కరోజులో వేయాల్సి ఉంటుంది. తర్వాత చిక్కుకుపోయిన కార్మికులకు అవసరమైన వస్తువుల సరఫరా కోసం 'ఆర్‌వీఎన్ఎల్' నిలువు పైప్‌లైన్ పనిని చేపట్టాల్సి ఉటుంది. 3.డీప్ డ్రిల్లింగ్‌లో నైపుణ్యం 'ఓఎన్‌జీసీ' సొంతం. అందుకే సొరంగం బార్కోట్ ఎండ్ నుంచి నిలువుగా డ్రిల్లింగ్ బాధ్యతను 'ఓఎన్‌జీసీ'కి అప్పగించారు. 4 .'ఎన్‌హెచ్ఐ‌డీసీఎల్' ఏజెన్సీ సొరంగం సిల్క్యారా ఎండ్ నుంచి డ్రిల్లింగ్ చేసే బాధ్యతను అప్పగించారు. దీనికి సపోర్టుగా ఆర్మీ బాక్స్ కల్వర్టును చేశారు. 5.సొరంగం బార్కోట్ నుంచి మైక్రో టన్నెలింగ్‌ చేసే బాధ్యతను 'టీహెచ్‌డీసీఎల్'కు అప్పగించారు. ఇప్పటికే ఈ ఏజెన్సీలు తమ పనిలో నిమగ్నమయ్యాయి.

ఉత్తరాఖండ్

రెస్క్యూ ఆపరేషన్‌లో ఆర్మీ, బీఆర్ఓ

రెస్క్యూ ఆపరేషన్‌లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO), ఇండియన్ ఆర్మీ నిర్మాణ విభాగం కూడా సహాయం చేస్తున్నట్లు అనురాగ్ జైన్ వివరించారు. నిపుణుల సలహా మేరకు ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించి.. ఐదు ప్లాన్స్‌ను రెడీ చేసినట్లు జైన్ పేర్కొన్నారు. కార్మికుల విలువైన ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని చెప్పారు. సొరంగం కూలిన ప్రదేశాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడారు. కార్మికులను బతికించడమే తమకు ప్రధానమన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే రెండు రోజుల్లో వారు బయటకు వస్తారని వెల్లడించారు.