LOADING...
PM Modi: భారతదేశ ఐక్యతకు చిహ్నం వందేమాతరం.. 150 సంవత్సరాల జాతీయ గీతంపై ప్రధానమంత్రి
వందేమాతరం మూలభావం అదే: ప్రధాని మోదీ

PM Modi: భారతదేశ ఐక్యతకు చిహ్నం వందేమాతరం.. 150 సంవత్సరాల జాతీయ గీతంపై ప్రధానమంత్రి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

వందేమాతరం కేవలం ఒక గేయం మాత్రమే కాదు,అది ఒక మహత్తర స్వప్నం,దృఢ సంకల్పం,అలాగే ఒక ప్రేరణాత్మక మంత్రం కూడా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు . ఈగేయంలో ఉన్న భావం దేశమాత పట్ల ఉన్న భక్తి, ఆరాధన,సేవాధర్మానికి ప్రతీక అనే విషయాన్ని ఆయన వివరించారు. అది దేశమాత ఆరాధన,సాధన అని పేర్కొన్నారు.ఈ గేయం మనందరినీ పురాణ కథలు,ఇతిహాసాల వైపు తీసుకెళ్లే శక్తి దాగి ఉందని మోదీ తెలిపారు. ''వందేమాతరం అనే పదం మనలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.రాబోయే కాలానికి కొత్త ధైర్యం,నమ్మకం ఇస్తుంది.అదే స్వరం,అదే లయం,అదే భావంతో కలిసి ఈ గేయం ఆలపించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. అలాంటి సామూహిక గీతగానం మన హృదయాన్ని లోతుగా తాకుతుంది'' అని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

ఈ గేయానికి నవంబరు 7, 2025తో 150 సంవత్సరాలు

వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఈ స్మారకోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇవి దేశ ప్రజలకు నవ చైతన్యం, ప్రేరణనిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ''ఈ సందర్భంగా వందేమాతరం స్మారక స్టాంపు, స్మారక నాణెం విడుదల చేశాం. ప్రతి గేయానికి ఒక అంతరార్థం, ఒక స్పష్టమైన సందేశం ఉంటుంది. మన వందేమాతరం గేయం ప్రాధమిక భావం భారతమాత - మా భారతి'' అని చెప్పారు. శుక్రవారం దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన వందేమాతరం 150వ స్మారకోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ, స్వాతంత్ర్య సమరంలో కోట్లు మంది భారతీయులకు పోరాట స్పూర్తిని అందించిన ఈ గేయానికి నవంబరు 7, 2025తో 150 సంవత్సరాలు పూర్తయ్యాయని గుర్తు చేశారు.

వివరాలు 

ఏడాది పొడవునా కార్యక్రమాలు

ఈ గేయాన్ని 1875 నవంబరు 7న బంకిమ్‌చంద్ర ఛటర్జీ రచించారు. ఆయన రాసిన 'ఆనంద్ మఠ్' అనే నవలలో ఈ గేయం మొదటిసారిగా ప్రచురితమైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంవత్సరం పొడవునా వందేమాతరం ప్రేరణతో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నదని తెలిపారు.

Advertisement