
Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటు.. సీఎం రేవంత్‌ను కలిసిన వ్యాన్‌గార్డ్ సీఈవో
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను స్థాపించనున్నట్లు వ్యాన్‌గార్డు సంస్థ ప్రకటించింది.
దేశంలో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
వ్యాన్‌గార్డు కంపెనీ ప్రతినిధులు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
ఈ కార్యాలయం ప్రారంభమైతే, 2500 మందికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
ఏఐ, డేటా సెంటర్, మొబైల్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ సానుకూల విధానాల కారణంగానే హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఎంచుకున్నట్లు వ్యాన్‌గార్డు సీఈవో తెలిపారు.
హైదరాబాద్‌లో అన్ని రంగాల్లో నిపుణుల విస్తృతంగా లభ్యమవుతున్నారని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.