Loading...
Governor quota MLC post: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెదేపా నేతలు వర్ల, రమాదేవి పేర్లు
గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెదేపా నేతలు వర్ల, రమాదేవి పేర్లు

Governor quota MLC post: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెదేపా నేతలు వర్ల, రమాదేవి పేర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

గవర్నర్‌ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ రెండు స్థానాల్లో ఎస్సీ, బీసీ వర్గాలకు ఒక్కో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, రాయలసీమకు చెందిన దళవాయి రమాదేవి పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. వర్ల రామయ్యతో పాటు అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలిగా ఉన్న దళవాయి రమాదేవి పేర్లను ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. తెదేపా సీనియర్‌ నాయకుడైన వర్ల రామయ్య గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

వివరాలు 

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా హనుమంతరావు

2009 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేశారు.

గుంటూరు,కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పీడీఎఫ్‌ తరఫున ఎం.హనుమంతరావును అభ్యర్థిగా ప్రకటించారు.

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తితో పాటు మాజీ ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రహ్మణ్యం, కేఎస్‌ లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు కలిసి ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.

ఎం.హనుమంతరావు సుమారు 30 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా సేవలందించారు. గత జూన్‌లో పదవీ విరమణ పొందారు.

ఏపీ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్‌)లో మండల ప్రధాన కార్యదర్శి నుంచి జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వరకు వివిధ బాధ్యతలను నిర్వహించిన అనుభవం ఆయనకు ఉందని పీడీఎఫ్‌ నేతలు తెలిపారు.

హనుమంతరావు అభ్యర్థిత్వానికి ఏపీ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్‌) కూడా మద్దతు ప్రకటించింది.

ADVERTISEMENT