
BJP: 83 మంది అభ్యర్థులతో రాజస్థాన్‌లో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ శనివారం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీకి సంబంధించి కీలక అభ్యర్థులు ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝల్రాపటన్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. సతీష్ పునియా అంబర్ నుంచి పోటీ చేస్తున్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్‌కు పార్టీ తారానగర్ టికెట్‌ను కేటాయించింది.
కాంగ్రెస్‌ను వీడి గత నెలలో బీజేపీలో చేరిన మాజీ ఎంపీ జ్యోతి మిర్ధాకు సైతం పార్టీ టికెట్ కేటాయించింది. ఆయన్ను నాగౌర్ స్థానం బరిలోకి దింపుతోంది.
ఇప్పటికే నవంబర్ 25న బీజేపీ 41మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.
తొలి జాబితాలో కేంద్ర మాజీమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ లాంటి వారు ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీజేపీ విడుదల చేసిన జాబితా
भाजपा की केन्द्रीय चुनाव समिति ने राजस्थान में होने वाले आगामी विधानसभा चुनाव 2023 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। (2/2) pic.twitter.com/h9ANGtLey2
— BJP Rajasthan (@BJP4Rajasthan) October 21, 2023