LOADING...
Jagdeep Dhankar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స

Jagdeep Dhankar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 09, 2025
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఆయన ఛాతి నొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆయనను ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (AIIMS)కి తరలించారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సమాచారం తెలియగానే, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎయిమ్స్‌కు వెళ్లి జగదీప్ ధన్కర్‌ను పరామర్శించారు.