NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cyber Scams: సైబర్‌ నేరం చేయకుంటే కరెంట్‌ షాక్‌.. లావోస్‌లో హైదరాబాద్‌ యువకులకు చిత్రహింసలు
    తదుపరి వార్తా కథనం
    Cyber Scams: సైబర్‌ నేరం చేయకుంటే కరెంట్‌ షాక్‌.. లావోస్‌లో హైదరాబాద్‌ యువకులకు చిత్రహింసలు
    సైబర్‌ నేరం చేయకుంటే కరెంట్‌ షాక్‌

    Cyber Scams: సైబర్‌ నేరం చేయకుంటే కరెంట్‌ షాక్‌.. లావోస్‌లో హైదరాబాద్‌ యువకులకు చిత్రహింసలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 11, 2024
    09:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల లావోస్‌లో సైబర్ బానిసలుగా ఉన్న భారతీయ యువకులను అక్కడి అధికారులు రక్షించిన విషయం తెలిసిందే.

    ఈ సైబర్ నేర ముఠాలు గతంలో కాంబోడియా,మయన్మార్‌లకే పరిమితమై ఉండగా,ఇప్పుడు లావోస్ వరకు విస్తరించాయి.

    బాధితుల్లో ఒకరు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

    ఆయన చెప్పిన వివరాల ప్రకారం,హైదరాబాద్‌కు చెందిన రాపిడో బైక్‌రైడర్‌(23)కి ఫాజిల్‌ఖాన్‌ అనే వ్యక్తి లావోస్‌లో ఛాట్‌ప్రాసెస్‌ ఉద్యోగం పేరుతో 35 వేల జీతం ఆశ చూపించాడు.

    అతను అబ్దుల్‌సమీ, దావూద్‌ అనే ఏజెంట్లను పరిచయం చేయడంతో, బైక్‌రైడర్‌ తన స్నేహితుడితో కలిసి లావోస్‌కు వెళ్లడానికి సిద్ధమయ్యాడు.

    వీరు 30 వేలు చెల్లించి, మే 1న సింగపూర్‌ మీదుగా లావోస్‌ రాజధాని వియెంటియాన్‌కు చేరుకున్నారు.

    వివరాలు 

    ప్రవాస భారతీయులను మోసగించేందుకు హనీట్రాప్, క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు

    గోల్డెన్‌ ట్రయాంగిల్‌కు వచ్చిన వీరి పాస్‌పోర్టులను ఇథియోపియన్‌ ఏజెంట్‌ తీసుకుని, టాన్‌పెర్న్‌ డిస్ట్రిక్ట్‌లోని ఒక కంపెనీకి పంపించాడు.

    అక్కడ వారికి కొన్ని పరీక్షలు నిర్వహించి, ఒప్పందంపై సంతకాలు తీసుకున్నారు.

    మొదటి రోజే కొత్త ఐఫోన్‌లు ఇచ్చి, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ సృష్టించారు. బాధితులు కొద్ది రోజుల్లోనే తమతో సైబర్‌ నేరాలు చేయించబోతున్నారని గ్రహించారు.

    తమను తిరిగి ఇండియాకు పంపించాలని ఏజెంట్లు సమీ, దావూద్‌లు వారు వేడుకున్నారు. చూస్తామని చెప్పిన ఆ ఇద్దరూ తర్వాత కనిపించలేదు.

    బాధితులు ప్రవాస భారతీయులను మోసగించేందుకు హనీట్రాప్, క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పేరుతో తప్పుడు పనులు అప్పగించారు.

    ఫేస్‌బుక్‌లో ఎన్‌ఆర్‌ఐలకు అమ్మాయిల పేరిట ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపి, వారి వద్ద నుంచి పెట్టుబడులు రాబట్టాలని చెబుతూ, టార్గెట్‌ను పూర్తిచేయకపోతే చిత్రహింసలకు గురిచేస్తుండేవారు.

    వివరాలు 

     ధైర్యం చేసిన హైదరాబాద్‌ యువకులు 

    వాళ్లు ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయకుంటే కరెంట్‌ షాక్‌లు ఇవ్వడం.. 15 అంతస్తులను రోజుకు ఏడుసార్లు ఎక్కడ , దిగడం చేయించేవారు.

    ఈ కఠిన శిక్షలను తట్టుకోలేక, రాజస్థాన్‌కు చెందిన కొంతమంది యువకులు లావోస్‌లోని ఇండియన్ ఎంబసీని ఆశ్రయించారు.

    హైదరాబాద్‌ యువకులు ధైర్యం చేసి ఎంబసీకి మెయిల్‌ చేయడంతో అక్కడి అధికారులు స్పందించి, యువకుల్ని విడిపించారు.

    వారి పాస్‌పోర్టులు సిద్ధం చేసి, వారు థాయిలాండ్‌ మీదుగా బ్యాంకాక్‌ చేరుకుని, ఆగస్టు 24న హైదరాబాద్‌ వచ్చారు.

    ఈ సంఘటనపై ఫాజిల్‌ఖాన్, సమీ, దావూద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సైబర్ నేరం
    హైదరాబాద్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    సైబర్ నేరం

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి

    హైదరాబాద్

    Bollaram: ఆసుపత్రి వద్ద పెను విషాదం.. చెట్టు కూలి భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు  భారతదేశం
    Hyderabad:ఎల్బీ నగర్‌లో అంబులెన్స్ డ్రైవర్లపై వ్యాపారి కర్రలతో దాడి  భారతదేశం
    Missing builder: కుత్బుల్లాపూర్ చింతల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. బీదర్ సమీపంలో లభించిన మృతదేహం  భారతదేశం
    Hyderabad: ప్రజాభవన్‌కు, నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025