LOADING...
Ajit Pawar:అక్రమ ఇసుక తవ్వకంపై.. మహిళా ఐపీఎస్'తో అజిత్ పవార్ వాగ్వాదం
అక్రమ ఇసుక తవ్వకంపై.. మహిళా ఐపీఎస్'తో అజిత్ పవార్ వాగ్వాదం

Ajit Pawar:అక్రమ ఇసుక తవ్వకంపై.. మహిళా ఐపీఎస్'తో అజిత్ పవార్ వాగ్వాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్,ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య జరిగిన వాగ్వాదం వైరల్‌గా మారింది. ఈ వివాదానికి కారణం,సోలాపూర్‌లోని ఒక గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలకు అంజనా కృష్ణ చర్యలు తీసుకోవడం అని తెలుస్తోంది. అసలు సంఘటన ఇలా జరిగింది.కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామంలో రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను అక్రమంగా తవ్విస్తున్నారని ఫిర్యాదులు సబ్-డివిజనల్ పోలీసు అధికారిణి అంజనా కృష్ణకు అందాయి. ఈఫిర్యాదులపై దృష్టి సారించి,రెండు రోజుల క్రితం ఆమె ఆ గ్రామానికి వెళ్లి స్థితి పరిశీలించారు. ఇదే సమయంలో కొందరు గ్రామస్థులు,స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని అధికారులతో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణ నేపథ్యంలో వారిలో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఫోన్‌ చేశారు.

వివరాలు 

నీకు ఎంత ధైర్యం?. నేను మీపై చర్యలు తీసుకుంటా" పవార్ 

పవార్, ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా అధికారులు చర్యలు తీసుకోవడం ఆపాలని అంజనా కృష్ణకు సూచించారు. ఆ సమయంలో వాళ్ళ మధ్య సంభాషణ ఇలా సాగింది: అజిత్ పవార్: "నేను ఉపముఖ్యమంత్రిని మాట్లాడుతున్నా. మీ చర్యలను వెంటనే ఆపేయండి." అంజనా కృష్ణ (ఐపీఎస్): "మీరు చెబుతున్నది నాకు అర్థమవుతోంది. కానీ, నిజంగా డిప్యూటీ సీఎంతోనే నేను మాట్లాడుతున్నానా? అని తెలుసుకోవాలి. నా నంబర్‌కు ఒకసారి వీడియో కాల్ చేస్తారా?" పవార్: నీకు ఎంత ధైర్యం?. నేను మీపై చర్యలు తీసుకుంటా. నన్నే వీడియో కాల్‌ చేయమంటారా?నన్ను చూడాలనుకుంటున్నారుగా.. నాకు వీడియో కాల్‌ చేయండి. దీంతో,అంజనా కృష్ణ పవార్‌కు వీడియో కాల్ చేశారు. ఈ సందర్భంగా పవార్ వెంటనే ఇసుక తవ్వకాలను ఆపాలని ఆదేశించారు.

వివరాలు 

 చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పవార్ ఎప్పుడు మద్దతు ఇవ్వరు: సునీల్ తట్కరే

ఈ సంభాషణను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారిన పరిస్థితిలో, పవార్ ప్రవర్తనపై నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వీడియోపై రాష్ట్ర పార్టీ చీఫ్ సునీల్ తట్కరే స్పందిస్తూ,పవార్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అర్జన కార్యకర్తలను శాంతింపజేయడానికి మాత్రమే అజిత్ పవార్ అంజనా కృష్ణను మందలించి ఉండవచ్చని చెప్పారు. అధికారిణి విధులను పూర్తిగా అడ్డుకోవాలనే ఉద్దేశం ఆయనకు లేదని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆయన ఎప్పుడూ మద్దతివ్వరని కూడా తట్కరే గుర్తు చేశారు. ఇక,ఈ వీడియోపై మాట్లాడేందుకు ఐపీఎస్‌ అధికారిణి అంజనా కృష్ణతో సహా పలువురు అధికారులు నిరాకరించారు. స్థానిక పోలీసులు కూడా దీనిపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..