Wayanad landslide: 'మీ ధైర్యం, త్యాగం మరువలేము'.. ఆర్మీ సైనికులకు సెల్యూట్
కేరళలోని వాయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 413 మందికిపైగా మరణించారు. ఇంకా 152 మంది అచూకీ తెలియాల్సి ఉంది. అర్మీ అధికారులు, సైనికులు కొండచరియల 10 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, సేవలందించారు. దీంతో కేరళలోని వాయనాడ్ ప్రజలు ఆర్మీ అధికారులకు, సైనికులు హృదయపూర్వక వీడ్కోలు పలికారు. భారత్ మాతా కీ జై, ఇండియన్ ఆర్మీ కీ జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు.
సైనికులకు సన్మానం
రెస్క్యూ ఆపరేషన్స్‌లో సైనికులు ప్రదర్శించిన ధైర్యసాహసాలు చూసి, కొచ్చి డిఫెన్స్ PRO అభినందనలు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన రెస్క్యూ ఆపరేషన్స్‌లో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించారని కొనియాడారు. మీ ధైర్యం, త్యాగం మరువలేమంటూ అని కొచ్చి డిఫెన్స్ PRO తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 122 పదాతిదళ బెటాలియన్ సైనికులు మౌంట్ టాబోర్ స్కూల్‌లోని ఉపాధ్యాయులు సిబ్బంది సత్కరించారు.