Loading...
Tamil Nadu Politics: స్టాలిన్‌కు విజయ్ పార్టీ షాక్.. 'సావర్కర్ 2.0' అంటూ సెటైర్లు!
స్టాలిన్‌కు విజయ్ పార్టీ షాక్.. 'సావర్కర్ 2.0' అంటూ సెటైర్లు!

Tamil Nadu Politics: స్టాలిన్‌కు విజయ్ పార్టీ షాక్.. 'సావర్కర్ 2.0' అంటూ సెటైర్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు (Delimitation Bill) మద్దతు ఇవ్వాలని డీఎంకే (DMK) నిర్ణయించుకోవడంపై నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఏకంగా 'సావర్కర్ 2.0'గా అభివర్ణించింది. టీవీకే ఐటీ వింగ్ సోషల్ మీడియా వేదికగా ఈ విమర్శలు చేసింది. ఆర్ఎస్ఎస్ యూనిఫామ్‌లో స్టాలిన్ ఉన్నట్లుగా రూపొందించిన ఫొటోను ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ సెటైర్లు వేసింది. అంతటితో ఆగకుండా.. సనాతనం అల్లా... సన్-ధనం అంటూ మరో పోస్టుతో డీఎంకేపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

వివరాలు

డీఎంకేకు టీవీకే సవాల్

గతంలో ఇదే బిల్లును వ్యతిరేకించిన స్టాలిన్.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే యూటర్న్ తీసుకున్నారని టీవీకే ఆరోపించింది.

పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని బహిరంగంగా ప్రకటించాలని టీవీకే గతంలోనే డీఎంకేకు సవాల్ విసిరింది.

ఒకవేళ ఓటింగ్‌కు దూరంగా ఉన్నా, సభ నుంచి వాకౌట్ చేసినా అది బీజేపీకి లొంగిపోవడమే అవుతుందని విమర్శించింది.

వివరాలు

తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న స్టాలిన్

టీవీకే విమర్శలపై డీఎంకే అధినేత స్టాలిన్ తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు.

ఏప్రిల్‌లో ఈ బిల్లును వ్యతిరేకించినప్పుడు తాము లేవనెత్తిన రెండు ప్రధాన డిమాండ్లను కేంద్రం ఇప్పుడు లిఖితపూర్వకంగా అంగీకరించిందని స్పష్టం చేశారు.

2024 నుంచి డీఎంకే చేస్తున్న నిరంతర పోరాటానికి, తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయంగా దీనిని అభివర్ణించారు.

ప్రజలు భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఆలోచించాలని స్టాలిన్ సూచించారు.

ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనదని, రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందని భావించే తాము బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ఎక్స్ వేదికగా వివరించారు.

ADVERTISEMENT