Loading...
Vijayasai Reddy: దసరా రోజున విజయసాయిరెడ్డి కీలక ప్రకటన.. కొత్త పార్టీకి మూహుర్తం ఫిక్స్!
దసరా రోజున విజయసాయిరెడ్డి కీలక ప్రకటన.. కొత్త పార్టీకి మూహుర్తం ఫిక్స్!

Vijayasai Reddy: దసరా రోజున విజయసాయిరెడ్డి కీలక ప్రకటన.. కొత్త పార్టీకి మూహుర్తం ఫిక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 20, 2026
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి దసరా పండుగ సందర్భంగా తాను స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీపై కీలక ప్రకటన చేశారు. పార్టీ ఆవిర్భావ ముహూర్తంతో పాటు దాని లక్ష్యాలు, ఆశయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలే ఎజెండాగా కొత్త పార్టీ ఆవిర్భవించబోతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండు పార్టీలు, రెండు కుటుంబాల దోపిడీకి ముగింపు పలకడం, కులపిచ్చి, మతపిచ్చి రాజకీయాలను రూపుమాపడమే తమ లక్ష్యమని విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని రెడ్‌బుక్ రాజ్యాంగం, 'రప్పారప్పా' ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి విముక్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కరువు కాటకాలు, కరెంటు కోతలు లేని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తామని దసరా పండుగ రోజున ప్రకటించారు.

వివరాలు

11వ నెల.. 11వ తేదీ.. ఉదయం 11:11 గంటలకు పార్టీ ఆవిర్భావం

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే కొత్త పార్టీ ఉద్దేశమని ఆయన వెల్లడించారు.

తన నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని నవంబర్ 11న నిర్వహించనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.

ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని 'ఎ-కన్వెన్షన్‌'లో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సును కోరుకునే వారందరూ తమ నూతన రాజకీయ ప్రస్థానానికి మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వివరాలు

  ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్తు

కొత్త పార్టీ ఎజెండాలో భాగంగా పలు కీలక లక్ష్యాలను విజయసాయిరెడ్డి వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి రెండు పంటలకు సరిపడా నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్తు అందేలా చూడటంతో పాటు విద్యాభారం తగ్గించి, యువతకు 100 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు పెరిగేలా, ఖర్చులు తగ్గేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత 80 ఏళ్లుగా నెరవేరని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు.

కొత్త రాజకీయ పార్టీని 'జెన్‌-జీ (Gen-Z) నాయకుల తయారీ ఫ్యాక్టరీ'గా తీర్చిదిద్దుతామని విజయసాయిరెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

ఇటీవల వాయిదా పడిన పార్టీ ప్రకటన

యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పునకు శ్రీకారం చుడతామని ఆయన సంకేతాలిచ్చారు.

కొన్ని రోజుల క్రితం విజయసాయిరెడ్డి తన రాజకీయ పార్టీ ఆవిర్భావంపై ప్రకటన చేయాల్సి ఉండగా, అనారోగ్య కారణాలతో దాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిపారు.

ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నానని, త్వరలోనే పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తానని అప్పట్లో వెల్లడించారు. అయితే, వైసీపీ నుంచి బెదిరింపులు రావడంతో ఆయన వెనక్కి తగ్గారనే ప్రచారం జరిగింది.

ఇతర వర్గాలకు చెందిన కొందరు కూడా విజయసాయిరెడ్డిని భయపెట్టడంతో పార్టీ ప్రకటనను వాయిదా వేశారనే వార్తలు వినిపించాయి.

ఈ ప్రచారంపై స్పందించిన ఆయన, పార్టీ స్థాపన విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తనను ఎవరూ బెదిరించలేదని పేర్కొన్నారు.

ADVERTISEMENT