LOADING...
Vijayawada Singapore Flights: ఇవాళ్టీ నుంచి విజయవాడ-సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం
ఇవాళ్టీ నుంచి విజయవాడ-సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

Vijayawada Singapore Flights: ఇవాళ్టీ నుంచి విజయవాడ-సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూసిన విజయవాడ-సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసు ఈ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ రూట్‌ను ఆపరేట్ చేయడానికి ముందుకు రావడంతో, అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల నుంచి విదేశీ ప్రయాణాలు మరింత సులభతరమవుతున్నాయి. ఈ తొలి విమాన సర్వీసును గన్నవరం విమానాశ్రయంలో ఘనంగా ప్రారంభించనున్నారు. విమానాశ్రయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు లాంఛనంగా దీన్ని ఆరంభించనున్నారు.

Details

మూడ్రోజులు అందుబాటులో

గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత రెడ్డి విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ సర్వీసు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం విజయవాడ నుంచి సింగపూర్‌కు, అలాగే సింగపూర్ నుంచి విజయవాడకు విమానాలు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. ఈ కొత్త అంతర్జాతీయ రూట్ ప్రారంభంతో వ్యాపారం, పర్యాటకం, విద్యా ప్రయాణాలకు విశేషంగా లాభం చేకూరుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. కొత్త సర్వీసు అందుబాటులోకి రావడం పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.