Loading...
TVK: నీట్‌ రద్దే పరిష్కారం.. విద్యను రాష్ట్రాలకు అప్పగించాలి: టీవీకే
నీట్‌ రద్దే పరిష్కారం.. విద్యను రాష్ట్రాలకు అప్పగించాలి: టీవీకే

TVK: నీట్‌ రద్దే పరిష్కారం.. విద్యను రాష్ట్రాలకు అప్పగించాలి: టీవీకే

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్‌ పరీక్ష వ్యవహారంపై దిల్లీలో ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలకు తమిళనాడుకు చెందిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీ మద్దతు ప్రకటించింది. నీట్‌ పరీక్షను పూర్తిగా రద్దు చేసినప్పుడే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ 'ఎక్స్‌' వేదికగా ప్రకటన విడుదల చేసింది. నీట్‌ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులకు మద్దతుగా ఎంపీ రాహుల్‌ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు నిర్వహించిన నిరసనలను టీవీకే ప్రస్తావించింది. ఆందోళనలో పాల్గొన్న నేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు కొనసాగిస్తున్న నిరసనలకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించింది.

వివరాలు 

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలి 

నీట్‌ విధానాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ను తాము చాలా కాలంగా వినిపిస్తున్నామని టీవీకే గుర్తుచేసింది.

వైద్య విద్యను రాష్ట్రాల జాబితాలో చేర్చడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడింది.

ఒకవేళ ఇందుకు న్యాయపరమైన అడ్డంకులు ఉంటే, అవి తొలగించే వరకు తాత్కాలిక ప్రత్యేక విధానాన్ని అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన అధికారాలు కల్పించాలని సూచించింది.

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని టీవీకే కోరింది.

దేశవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనలకు ముగింపు పలకాలంటే నీట్‌ పరీక్షను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని పార్టీ మరోసారి డిమాండ్‌ చేసింది.

ADVERTISEMENT