Vijaysai Reddy: విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్సీపీ (YSRCP) రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
తన రాజ్యసభ సభ్యత్వానికి ఈనెల 25న రాజీనామా చేస్తానని ట్విట్టర్‌లో వెల్లడించారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు:
ఏ రాజకీయ పార్టీలో చేరను. వేరే పదవులు లేదా ప్రయోజనాల కోసం రాజీనామా చేయడం లేదు.
ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం.ఎలాంటి ఒత్తిళ్లు లేవు,ఎవరూ నన్ను ప్రభావితం చేయలేదు. నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నాపై విశ్వాసం ఉంచి, నన్ను ఆదరించిన వైఎస్ కుటుంబానికి సదా రుణపడి ఉంటాను.రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి , అలాగే నన్ను ఇంతటి స్థాయికి తీసుకువచ్చిన వైఎస్ భారతికి నా శాశ్వత కృతజ్ఞతలు.నేను జగన్‌కి మంచి జరగాలని ఎప్పుడూ కోరుకుంటాను.''
వివరాలు
నా భవిష్యత్తు వ్యవసాయం..
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, మరియు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ,రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశాను. కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిలా పనిచేశాను.
నా రాజకీయ ప్రస్థానంలో దాదాపు తొమ్మిదేళ్ల పాటు ప్రోత్సహించి,నాకు గొప్ప గుర్తింపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ప్రత్యేక ధన్యవాదాలు.
తెదేపాతో రాజకీయంగా విభేదించాను,కానీ చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. పవన్ కల్యాణ్‌తో నా చిరకాల స్నేహం కొనసాగుతుంది.
ఇకపై నా జీవితం వ్యవసాయం వైపే మళ్లుతుంది. నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నన్ను ఆదరించిన రాష్ట్ర ప్రజలు, మిత్రులు,సహచరులు, పార్టీ కార్యకర్తలకు పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.''
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2025
రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.
ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు.
ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.…