
Vimal pan masala: విమల్ పాన్ మసాలా వివాదం.. బాలీవుడ్ స్టార్లకు నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
జైపూర్‌కు చెందిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక (GIP) బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లతో పాటు JB ఇండస్ట్రీస్ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది.
విమల్ పాన్ మసాలా ప్రకటనలో "ప్రతీ గింజలో కుంకుమ పువ్వు ఉంది" అని పేర్కొనడం ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వివాదంపై బాలీవుడ్ స్టార్లు వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా మార్చి 19న హాజరు కావాలని ఫోరం సమన్లు జారీ చేసింది. ఈ కేసు, జైపూర్ నివాసి యోగేంద్ర సింగ్ బడియాల్ ఫిర్యాదుతో ప్రారంభమైంది.
Details
కంపెనీ ఛైర్మన్ కు నోటీసులు
ప్రకటనలో పేర్కొన్నట్లు నిజంగా కుంకుమ పువ్వు ఉంటే, అది చాలా ఖరీదై ఉండాలన్నారు.
అయితే రూ. 5కే పాన్ మసాలా అమ్ముడవుతున్నందున, అందులో నిజమైన కుంకుమ పువ్వు లేదా దాని సువాసన ఉండే అవకాశమే లేదని ఫిర్యాదుదారుడు వాదించాడు.
ఫోరంలోని గైర్సిలాల్ మీనా, హేమలతా అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ ఫిర్యాదును స్వీకరించి, నటులకు, కంపెనీ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది.
యాడ్ లో తప్పుడు వాదనలు ఉండటంతో పాటు, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఈ ప్రకటనపై నిషేధం విధించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.