Jaipur: జైపూర్ మహారాజా కాలేజీలో హింసాత్మక ఘటన.. విద్యార్థులపై ఇనుపరాడ్లతో విరుచుకుపడ్డ దుండగులు
ఈ వార్తాకథనం ఏంటి
జైపూర్‌లో ఉన్న ప్రతిష్ఠాత్మక మహారాజా కాలేజీ పరిసరాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గోఖలే హాస్టల్ గేటు వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమైన కొంతమంది గుర్తు తెలియని దుండగులు విద్యార్థులపై కర్రలు, ఇనుప రాడ్లతో తీవ్రంగా దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో పలువురు విద్యార్థులు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. వీడియోను ఆధారంగా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసి, దుండగుల గుర్తింపుతో పాటు పూర్తి వివరాలపై దర్యాప్తు మొదలుపెట్టారు.
వివరాలు
భద్రత కట్టుదిట్టం
ప్రాథమికంగా అందుతున్న వివరాల ప్రకారం వ్యక్తిగత వైరం, రెండు గుంపుల మధ్య ఉన్న పాత విభేదాలే ఈ హింసాత్మక ఘటనకు మూలకారణంగా భావిస్తున్నారు. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనతో కాలేజీ క్యాంపస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పరిస్థితి అదుపులో ఉండేలా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జైపూర్‌లోని మహారాజాకాలేజ్ హాస్టల్ క్యాంపస్‌లో ఘటన
కాలేజీ హాస్టల్లో విద్యార్థుల మధ్య హింసాత్మక దాడి!
— Telugu Feed (@Telugufeedsite) December 9, 2025
జైపూర్‌లోని మహారాజాకాలేజ్ హాస్టల్ క్యాంపస్‌లో ఘటన
రెండు వర్గాలుగా విడిపోయి.. గోఖలే హాస్టల్ వద్ద పగటిపూట ఇనుప రాడ్లు, మెటల్ బార్లు, కర్రలతో దాడి
ఈ ఘటనలో ఆరుగురికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం pic.twitter.com/zZnz2jJ3ME