Visakha Partnership Summit: విశాఖలో 30వ పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌కు సిద్ధమైన ప్రభుత్వం.. తొలిరోజు చర్చించే అంశాలివే
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే 30వ పార్ట్నర్‌షిప్ సమ్మిట్ కోసం ప్రభుత్వం, సంబంధిత శాఖలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాయి. ఈ సదస్సు విషయంపై సోమవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కూడా విస్తృతంగా చర్చ జరిగింది. 14న కార్యక్రమం ఓపెనింగ్ ప్లీనరీతో ప్రారంభమవుతుంది. ఈ తొలి సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్ 65 శాతం వృద్ధి రేటును నమోదు చేయడంపై విశ్లేషణ,చర్చ జరగనుంది.
వివరాలు
సమ్మిట్‌లో అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన 8 మంది ప్రముఖ స్పీకర్లు
ఈ రెండు రోజుల సదస్సుకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్, రామ్మోహన్ నాయుడు, అశ్విని వైష్ణవ్, అన్నపూర్ణా దేవి, జితేంద్ర సింగ్ తదితరులు హాజరు కానున్నారు. అదేవిధంగా 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు కూడా రానున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన 8 మంది ప్రముఖ స్పీకర్లు సమ్మిట్‌లో ప్రసంగించనున్నారు. పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌లో ఒక ప్రధాన ప్లీనరీ సెషన్‌తో పాటు: సీఐఐ ఆధ్వర్యంలో 27 టెక్నికల్ సెషన్లు రాష్ట్ర ప్రభుత్వం & సీఐఐ కలిసి నిర్వహించే 11 సంయుక్త సెషన్లు జరుగనున్నాయి.
వివరాలు
దేశీయ విషయాలకు సంబంధించిన 5 ప్రత్యేక సెషన్లు ఒక వీడ్కోలు సెషన్
దేశీయ విషయాలకు సంబంధించిన 5 ప్రత్యేక సెషన్లు ఒక వీడ్కోలు సెషన్ తయారు చేస్తున్నారు. ఈ సదస్సు ద్వారా ₹9,76,248 కోట్ల పెట్టుబడులు ఆకర్షించే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. దాంతో సుమారు 7,48,427 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సదస్సు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా: 30 ప్రాజెక్టులను ప్రారంభించేందుకు 82 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది.