Vande Bharat Sleeper: విశాఖ-బెంగళూరు మధ్య వందేభారత్ స్లీపర్.. త్వరలో పట్టాలెక్కనున్న తొలి రైలు
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం, బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య తొలి వందేభారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇందుకు సంబంధించి రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.రైలు రాకపోకల కోసం దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు ఇప్పటికే రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. అలాగే విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డీఆర్‌ఎంలకు అవసరమైన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.
వివరాలు
సోమవారం మినహా ప్రతిరోజూ సేవలు
వందేభారత్ స్లీపర్ రైలు సోమవారం మినహా మిగతా అన్ని రోజుల్లో నడవనుంది.
విశాఖపట్నం నుంచి బయలుదేరే సమయాలు
రాత్రి 8:15 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరు
8:45 గంటలకు దువ్వాడ
అర్ధరాత్రి 1:05 గంటలకు కృష్ణా కెనాల్
తెల్లవారుజామున 4:40 గంటలకు నంద్యాల
ఉదయం 7:30 గంటలకు ధర్మవరం
ఉదయం 10:00 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణం ఇలా..
రాత్రి 8:00 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరు
10:30 గంటలకు ధర్మవరం
అర్ధరాత్రి 1:02 గంటలకు నంద్యాల
తెల్లవారుజామున 4:55 గంటలకు కృష్ణా కెనాల్
ఉదయం 9:15 గంటలకు దువ్వాడ
ఉదయం 10:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
వివరాలు
ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింపు
ప్రస్తుతం విశాఖపట్నం-బెంగళూరు మధ్య ప్రయాణానికి సుమారు 18 నుంచి 20 గంటలు పడుతోంది.
అయితే కొత్త వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ఈ దూరాన్ని కేవలం 14 గంటల్లోనే పూర్తి చేయవచ్చు.
దీంతో రెండు నగరాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు గణనీయమైన సమయ ఆదా కానుంది.