Page Loader
Visvesvara Raja: పాడేరు ఎమ్మెల్యే వీరత్వం.. వరదలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన విశ్వేశ్వరరాజు
పాడేరు ఎమ్మెల్యే వీరత్వం.. వరదలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన విశ్వేశ్వరరాజు

Visvesvara Raja: పాడేరు ఎమ్మెల్యే వీరత్వం.. వరదలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన విశ్వేశ్వరరాజు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2024
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు సాహసం చేసి, వరదలో చిక్కుకున్న ఓ యువకుడి ప్రాణాన్ని కాపాడాడు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పాడేరు మండలంలోని రాయిగడ్డ కాజ్‌వేపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండగా, ఓ యువకుడు ప్రమాదవశాత్తూ వరదను దాటే ప్రయత్నం చేశాడు. అయితే అతను బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోవడం గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అక్కడే ఉండగా, ఈ ఘటనను గమనించి తక్షణమే స్పందించారు.

Details

  ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుపై ప్రశంసల వర్షం

గెడ్డలోకి దిగిన ఎమ్మెల్యే, యువకుడిని రక్షించేందుకు స్వయంగా ప్రయత్నించారు. బైకిస్ట్‌ తన బండిని వదలకపోవడంతో కొద్దిదూరం వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఎమ్మెల్యే చేసిన కేకలకు స్పందించిన స్థానికులు తాడును అందించాడు. దీంతో చివరికి ఆ యువకుడు ఎమ్మెల్యే ఇద్దరూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. యువకుడి ప్రాణాలను కాపాడిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు.