Vizag Steel: ప్యాకేజీతో హడావుడి..మరోపక్క సిబ్బంది తగ్గింపు..అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఏం జరుగుతోంది?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెబుతున్నారు.
కానీ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం తీసుకుంటున్న చర్యలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.
భద్రతా సిబ్బందిని తగ్గించడం, ప్రైవేటీకరణ దిశగా ముందు అడుగులుగా కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫైర్ స్టేషన్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు టెండర్లు పిలిచారు.
వివరాలు
ప్యాకేజీతో చర్చలు, కానీ ప్రైవేటీకరణ ఆగదు
కార్మిక సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు పునరుద్ధరణ ప్యాకేజీపై చర్చలు జరుపుతుండగా, మరోవైపు ప్రైవేటీకరణ చర్యలు ఆపడం లేదని కార్మిక సంఘాల నాయకుడు సీహెచ్ నర్సింగ్ రావు విమర్శించారు.
కాంట్రాక్టు ఉద్యోగులలో సుమారు 800 మందిని పునరుద్ధరించలేదు. ఇంకా ఉద్యోగులను వీఆర్ఎస్ పథకం కింద పంపే ప్రక్రియ కొనసాగుతోంది.
సిబ్బంది తగ్గింపు
సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందిని తగ్గించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన గేటు వద్ద వాహనాల తనిఖీ చేసే సిబ్బంది సంఖ్యను బుధవారం నుంచి తగ్గించారు.
వివరాలు
మెడికల్ స్కీం - మార్పులు
రిటైర్డ్ ఉద్యోగుల మెడికల్ స్కీం లో భారీ కోతలను ప్రతిపాదించారు.
జీఎంఎస్ స్కీం కింద 6 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అందిస్తారు, కానీ ఉద్యోగులపై అదనపు ఆర్థిక భారం పెరుగుతోంది.
ఓపీడీ రీయింబర్స్‌మెంట్ విధానంలో కూడా 30% వంతు ఉద్యోగులు భరించాల్సి ఉంటుంది.
ప్యాకేజీపై అనిశ్చితి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పునరుద్ధరణ ప్యాకేజీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు.
ప్యాకేజీ మొత్తం రూ.11,444 కోట్లుగా ప్రకటించగా, మొదటి విడతగా రూ.10,300 కోట్ల ఖర్చుపై స్పష్టత లేదు.
వివరాలు
వీఆర్ఎస్ - పెద్ద సంఖ్యలో దరఖాస్తులు
ఇప్పటి వరకు 700 మంది ఉద్యోగులు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారు.
ఈ నెల చివరి వరకు వీఆర్ఎస్ దరఖాస్తులకు గడువు ఉంది.
12,300 మంది శాశ్వత ఉద్యోగుల్లో 800 మంది ఈ ఏడాది రిటైర్ కానున్నారు, దీని వల్ల ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గనుంది.