Page Loader
నీటిపారుదల శాఖలో లష్కర్లు,  5,950మంది వీఆర్‌ఏలకు త్వరలో పోస్టింగ్స్
నీటిపారుదల శాఖలో లష్కర్లు, 5,950మంది వీఆర్‌ఏలకు త్వరలో పోస్టింగ్స్

నీటిపారుదల శాఖలో లష్కర్లు,  5,950మంది వీఆర్‌ఏలకు త్వరలో పోస్టింగ్స్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 16, 2023
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని వీఆర్‌ఏల్లో దాదాపు 5 వేల 950 మందిని నీటిపారుదల శాఖలో ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. ఈ మేరకు వారిని నీటిపారుదల శాఖలో లష్కర్లుగా నియమించాలని సర్కారు యోచిస్తోంది. ఈ క్రమంలోనే పే స్కేల్‌ సైతం వర్తింపజేయాలని సదరు శాఖ ప్రతిపాదనలను రెఢీ చేసింది. రాష్ట్రంలో దాదాపు 21 వేల మందికిపైగా గ్రామ రెవెన్యూ సహాయకులు ఉన్నారు. రాష్ట్రంలో భారీగా నిర్మితమైన నీటి ప్రాజెక్టుల్లో వీఆర్‌ఏల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సాగునీరు వృథా పోకుండా ఇప్పటికే టెయిల్‌ ఎండ్‌, వారబంది విధానాలను పాటిస్తోంది. దీంతో తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణాన్ని సాగులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది.

DETAILS

 నీటి వృథాను అరికట్టడంలో లష్కర్లు పాత్ర కీలకం : నీటిపారుదల శాఖ 

ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణకు సాగునీటి పారుదల శాఖను ఈ మేరకు పునర్వస్థీకరించి ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాన్ని సైతం ఏర్పరచింది. ఈ నేపథ్యంలోనే ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ను నియమంచి బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఆ విభాగం ప్రాజెక్టుల నిర్వహణకు వీఆర్ఏలను లష్కర్లుగా నియమించాలని నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులు, కాలువలు, చెరువుల తూములకు సంబంధించి నీటి వృథాను అరికట్టడంలో లష్కర్లు ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు. ఉమ్మడి ఏపీలో వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో చాలా వరకు గేట్లు, తూములు నిరూపయోగంగా మారాయి. పలు చోట్లు తప్పుబట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులకు వెయ్యి వరకు గేట్లు ఉంటాయని అంచనా. వాటిల్లో కాలువలు, తూములకు 15 వేలకుపైగా గేట్లు ఉండొచ్చని నీటిపారుదల శాఖ పేర్కొంది.