
Andhra News: నేడు దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా వీవీఎస్‌ఎస్ శర్మకు 'జాతీయ జియోసైన్సు' అవార్డు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ప్రతిష్ఠాత్మకమైన కలిగిన 'జాతీయ జియో సైన్సు అవార్డు-2024'కి విశాఖపట్టణం నుంచి డాక్టర్ వేదుల వెంకట సుబ్రహ్మణ్య శ్రీనివాస శర్మను ఎంపిక చేశారు. ఈ అవార్డు శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు. భూవిజ్ఞాన శాస్త్ర విభాగంలో అసాధారణ విజయాలను సాధించి, ప్రత్యేక కృషిని చాటిన వ్యక్తులను సత్కరించడమే ఈ అవార్డు ముఖ్య లక్ష్యం. 2024 సంవత్సరానికి దేశవ్యాప్తంగా మొత్తం 208 నామినేషన్లు అందాయి. కఠినమైన మూడు దశల స్క్రీనింగ్ ప్రక్రియలో ప్రక్రియ తరువాత, వివిధ శాస్త్ర విభాగాలలో 12 మంది ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలను ఎంపిక చేశారు. ఈసారి ఓషనోగ్రఫీ రంగంలో చేసిన అత్యుత్తమ పరిశోధనలకు డాక్టర్ శ్రీనివాస శర్మ జియో సైన్సు అవార్డు అందుకోవడానికి అర్హులయ్యారు.
వివరాలు
టాప్ 2శాతం శాస్త్రవేత్తల్లో శర్మ ఒకరు
ప్రస్తుతం ఆయన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)‑నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (NIO) ప్రాంతీయ కేంద్రానికి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాక, అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, ఎల్సివియర్ గుర్తించిన ప్రపంచంలోని టాప్ 2శాతం శాస్త్రవేత్తల్లో ఒకరుగా శర్మ నిలిచారు.