LOADING...
Amaravati: రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కోసం అల్లాడుతున్న వ్యాపారులు
రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కోసం అల్లాడుతున్న వ్యాపారులు

Amaravati: రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కోసం అల్లాడుతున్న వ్యాపారులు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 16, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు గ్యాస్‌ సరఫరాపై కనిపిస్తోంది. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరత కారణంగా ఏపీలోని అనేక ప్రాంతాల్లో హోటళ్లు, రోడ్డుపక్కన బజ్జీలు, పానీపూరీ, ఫ్రైడ్‌ రైస్‌ వంటి వంటకాలు విక్రయించే తోపుడుబండ్లు మూతపడుతున్నాయి. టిఫిన్లు, భోజనాల ధరలు పెంపు గ్యాస్‌ కొరతతో హోటల్‌ వ్యాపారులపై అదనపు భారం పడుతోంది. దీంతో ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, వడ వంటి టిఫిన్లతో పాటు భోజనాల ధరలను కూడా రూ.10 నుంచి రూ.20 వరకు పెంచారు. కాఫీ, టీ ధరలు కూడా పెరిగి ప్రస్తుతం రూ.15 నుంచి రూ.25 మధ్యకు చేరుకున్నాయి.

వివరాలు 

రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం

విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు సహా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత రెండు రోజులుగా వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో కొందరు నల్లబజారును ఆశ్రయిస్తున్నామని చెబుతున్నారు. నల్లబజారులో భారీ ధరలు 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ కోసం రూ.4,500 నుంచి రూ.5 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. అంత అధిక ధర చెల్లించలేని చిన్న వ్యాపారులు, హోటల్‌ యజమానులు కట్టెల పొయ్యిలపై వంట చేసేందుకు మారుతున్నారు.

వివరాలు 

అధికారుల మాట ఒకటే.. క్షేత్రస్థాయిలో మరో పరిస్థితి

గ్యాస్‌ కొరత ఏమీలేదని పౌరసరఫరాల శాఖ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం 19 కిలోల వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా నెల్లూరులో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఒకటి, రెండు వాణిజ్య సిలిండర్లు కూడా అందుబాటులో లేవని, సోమవారం నుంచి కొరత ఇంకా పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర స్టార్‌ హోటళ్ల సంఘం అధ్యక్షుడు ఆర్‌వీ స్వామి 'ప్రముఖ మీడియా'కు తెలిపారు. కట్టెల ధరలకూ మంట గ్యాస్‌ దొరకకపోవడంతో ప్రత్యామ్నాయంగా వాడుతున్న వంట చెరకు ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. మొన్నటి వరకు టన్ను రూ.3,500 నుంచి రూ.4 వేల లోపే ఉన్న చెరకు ధర ఇప్పుడు దాదాపు రెట్టింపు అయింది.

Advertisement

వివరాలు 

విశాఖలో టన్ను రూ.10 వేలు

విశాఖపట్నంలో వంట చెరకు టన్ను రూ.10 వేలు పలుకుతోంది. తిరుపతిలో టన్ను ధర రూ.6,500కు పైగానే ఉంది. అడితీల్లో వ్యర్థాలతోపాటు ఎలాంటి కట్టెలు తీసుకొచ్చినా వెంటనే అమ్ముడైపోతున్నాయి. బ్రికెట్లకు పెరిగిన డిమాండ్‌ వ్యవసాయ వ్యర్థాలు, రంపపు పొట్టు వంటి పదార్థాలతో తయారుచేసే బ్రికెట్లకూ ఇప్పుడు భారీగా డిమాండ్‌ పెరిగింది. గ్యాస్‌ కొరత కారణంగా ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం వ్యాపారులు, హోటల్‌ నిర్వాహకులు పోటీపడుతున్నారు.

Advertisement