IMD Rain Alert: ఈదురుగాలులు, వడగళ్ల వానల హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
ఒకవైపు ఎల్‌నినో ప్రభావంపై ఆందోళనలు, మరోవైపు దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండల మధ్య భారత వాతావరణ శాఖ ప్రజలకు ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని పేర్కొంటూ, దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్షాలు, తుఫానుల హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, కేరళ, గోవా, తెలంగాణ ఉన్నాయి. ఈరోజు కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, ఈశాన్య భారత రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వివరాలు
మే 25న వడగళ్ల వాన
అలాగే మే 25న దిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలి, ధర్మశాల ప్రాంతాల్లో మే 29 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, నైనిటాల్, హరిద్వార్ ప్రాంతాల్లో వాతావరణం మారుతున్నట్లు తెలిపింది. మే 25న బలమైన గాలులతో పాటు వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
వివరాలు
ఈరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం
మే 24, 25 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్, జమ్మూ, పహల్గామ్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా జార్ఖండ్‌లోని రాంచీ, జంషెడ్‌పూర్, ధన్‌బాద్ ప్రాంతాల్లో మే 24, 25 తేదీల్లో తీవ్ర ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం మే 26 నుంచి 29 మధ్య రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.