Page Loader
Coaching Centres: కోచింగ్‌ సెంటర్లకు హెచ్చరిక.. '100 శాతం సెలెక్షన్' ప్రకటనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
కోచింగ్‌ సెంటర్లకు హెచ్చరిక.. '100 శాతం సెలెక్షన్' ప్రకటనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Coaching Centres: కోచింగ్‌ సెంటర్లకు హెచ్చరిక.. '100 శాతం సెలెక్షన్' ప్రకటనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2024
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లపై నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. కోచింగ్ సెంటర్లు చేసే తప్పుడు ప్రకటనలు, ఉదాహరణకు '100 శాతం జాబ్ గ్యారెంటీ' లేదా '100 శాతం సెలెక్షన్' వంటి అసత్య వాగ్దానాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది. కేంద్ర వినియోగదారుల భద్రతా సంస్థకు ఫిర్యాదుల రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే మాట్లాడారు.

Details

హానీ కలిగించే ప్రకటనలు ఇవ్వరాదు

తమ సక్సెస్‌ రేటు, సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తీసుకున్న కోర్సులు మొదలైన విషయాల గురించి కోచింగ్ సెంటర్లు ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల నుంచి కొంత సమాచారాన్ని దాస్తుండడం తాము గమనించామని చెప్పారు. అందువల్ల వాటి నిర్వాహకుల కోసం పలు మార్గదర్శకాలు రూపొందించామని ఆయన తెలియజేశారు. విద్యార్థుల హక్కులకు హాని కలిగించే విధంగా ప్రకటనలు చేయకూడదని కేంద్రం వివిధ మార్గదర్శకాలను రూపొందించింది.

Details

కేంద్రం చేసిన మార్గదర్శకాలు ఇవే 

1. కోచింగ్ సెంటర్లు తమ కోర్సుల గురించి, అలాగే వాటి వ్యవధి గురించి తప్పుగా ప్రకటనలు చేయకూడదు. 2. అభ్యర్థుల రాతపూర్వక అనుమతి లేకుండా, కోచింగ్ సెంటర్లు అభ్యర్థుల పేర్లు, ఫోటోలను ప్రదర్శించకూడదు. 3. కోర్సుల సంబంధిత ముఖ్యమైన సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించాలి. 4. యూపీఎస్సీ అభ్యర్థులు సాధారణంగా ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు స్వతంత్రంగా రాయటంతో, కోచింగ్ సెంటర్లు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. 5. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, తమ కోచింగ్ సెంటర్ల గురించి కూడా వివరాలు ఇవ్వాలి. 6. కోచింగ్ సెంటర్లు చట్టబద్ధంగా అనుమతి పొందిన భవనాలలో మాత్రమే ఏర్పాటు చేయాలి. 7. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మరియు భద్రత అందించాలి.