Page Loader
Kakinada: ఉప్పాడ తీరంలో పెరిగిన అలల ఉద్ధృతి.. జలమయమైన మాయపట్నం గ్రామం
ఉప్పాడ తీరంలో పెరిగిన అలల ఉద్ధృతి.. జలమయమైన మాయపట్నం గ్రామం

Kakinada: ఉప్పాడ తీరంలో పెరిగిన అలల ఉద్ధృతి.. జలమయమైన మాయపట్నం గ్రామం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర అలల ఉద్ధృతి తీవ్రంగా పెరిగింది. ఈ పరిణామం వల్ల కొత్తపల్లి మండలానికి చెందిన మాయపట్నం గ్రామంపై సముద్రం విరుచుకుపడింది. భారీ కెరటాల ధాటికి గ్రామం మొత్తం జలమయంగా మారిపోయింది. సముద్రపు నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు. సముద్రపు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు అధికారులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. మాయపట్నంలో నీటిని వెనక్కి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన జియో ట్యూబులు,రక్షణ గోడలు ధ్వంసమవడంతో సముద్రపు నీరు వరుసగా గ్రామంలోకి చేరుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉప్పాడ తీరం మాయపట్నం లో గ్రామంలోకి సముద్రపు నీరు!