LOADING...
Revanth Reddy: చంద్రబాబు, వైఎస్‌ అభివృద్ధి మార్గాలను అనుసరిస్తున్నాం : సీఎం రేవంత్
చంద్రబాబు, వైఎస్‌ అభివృద్ధి మార్గాలను అనుసరిస్తున్నాం : సీఎం రేవంత్

Revanth Reddy: చంద్రబాబు, వైఎస్‌ అభివృద్ధి మార్గాలను అనుసరిస్తున్నాం : సీఎం రేవంత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మీట్‌ ది ప్రెస్‌' కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తీసుకున్న అభివృద్ధి విధానాలను ఇప్పుడు తమ ప్రభుత్వం కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. 'జీసీసీలు, డేటా సెంటర్లకు హైదరాబాద్‌ హబ్‌గా ఎదిగింది. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కాలంలో పునాది పడిన ఐటీ రంగం నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వచ్చిన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్‌ నగర అభివృద్ధిని కొత్త దశకు చేర్చాయి. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాల వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి దిశగా దూసుకెళ్లిందని సీఎం రేవంత్‌ అన్నారు.

Details

అభివృద్ధిలో ఐటీ రంగం కీలక పాత్ర