2036 Olympics: 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం : మోదీ
దేశం ఈరోజు 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 2036లో జరగనున్న ఒలింపిక్స్ గురించి మాట్లాడారు. భారతదేశ ప్రమాణం ప్రపంచ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామని అన్నారు. మేము డిజైన్ ఇన్ ఇండియా, డిజైన్ ఫర్ వరల్డ్ దిశగా పని చేస్తున్నామని అన్నారు. ఏ జి-20 దేశం చేయలేనిది భారత ప్రజలు చేశారని అన్నారు. ఇంతకు ముందు పారిస్‌లో పెట్టుకున్న పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని చేరుకోగల దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం మాత్రమే అన్నారు.
పెద్ద ఈవెంట్‌లను నిర్వహించగల సత్తా భారత్‌కు ఉంది : మోదీ
2036 ఒలింపిక్ క్రీడలకు సంబంధించి, జి-20 సమావేశాలు దేశవ్యాప్తంగా, వివిధ నగరాల్లో జరిగాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇంకా పెద్ద ఈవెంట్‌లను నిర్వహించగల సత్తా భారత్‌కు ఉందని ఇది రుజువు చేస్తోందన్నారు. 2036లో భారత్‌లో జరిగే ఒలింపిక్స్‌కు సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతక విజేతలను అభినందించిన ఆయన, పారాలింపిక్స్ కోసం పారిస్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.