LOADING...
Air Pollution: గాలి స్వచ్ఛంగా లేదు.. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18% జీఎస్టీ.. కేంద్రాన్ని ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు
కేంద్రాన్ని ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు

Air Pollution: గాలి స్వచ్ఛంగా లేదు.. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18% జీఎస్టీ.. కేంద్రాన్ని ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో, ఎయిర్ ప్యూరిఫైయర్లపై ఇప్పటికీ 18 శాతం జీఎస్టీ వసూలు చేయడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లోనూ ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు పరిశీలించడం లేదని కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎయిర్ ప్యూరిఫైయర్లను వైద్య పరికరాలుగా గుర్తించి, వాటిని 5 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోకి తీసుకురావాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేసింది.

వివరాలు 

వాయు కాలుష్యం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు: సుప్రీం   

"ప్రతి మనిషి రోజుకు సుమారు 21 వేల సార్లు శ్వాస తీసుకుంటాడు. అలాంటప్పుడు కలుషిత గాలి మన ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఆలోచించాలి" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌పై స్పందించేందుకు మరింత సమయం ఇవ్వాలని కేంద్రం కోరగా,దానిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యం కారణంగా ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్న ధర్మాసనం, ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి పొందే హక్కు ఉందని గుర్తు చేసింది. స్వచ్ఛమైన గాలి అందించలేని పరిస్థితుల్లో కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లు అయినా సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

వివరాలు 

కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం 

ప్రస్తుతం ఎయిర్ ఎమర్జెన్సీ నెలకొన్న నేపథ్యంలో, జాతీయ భద్రతా చట్టం కింద తాత్కాలిక చర్యలు తీసుకోవడం లేదా ఎయిర్ ప్యూరిఫైయర్లపై వెంటనే పన్ను మినహాయింపులు ఇవ్వడం సాధ్యంకాదా? అంటూ కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై ఈ రోజే తమ వైఖరిని తెలియజేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.

Advertisement