
PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉగ్ర దాడులతో దేశవ్యాప్తంగా ప్రతి హృదయం రగిలిపోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఈ క్రమంలో పౌరులు, అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ఉగ్రవాదానికి విరుద్ధంగా కలిసికట్టుగా స్పందించాయని తెలిపారు.
ఉగ్రవాద శిబిరాలపై భారత్ మిసైళ్లతో విరుచుకుపడిందని, ఆ దాడులు ఉగ్రవాదులు కలల్లో కూడా ఊహించలేని రీతిలో జరిగాయని పేర్కొన్నారు.
భారత్ చేపట్టిన దాడుల ప్రభావంతో గందరగోళానికి గురైన పాకిస్థాన్, మన దేశంలోని పాఠశాలలు, జనవాసాలపై దాడులకు పాల్పడిందని మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఈ దాడులకు భారత్ తగిన బుద్ధి చెప్పిందని, కేవలం మూడురోజుల్లోనే భారత దళాలు పాక్‌ను తికమకకు గురి చేశాయని వెల్లడించారు.
Details
పాకిస్థాన్ వెనుకడుగేసింది
వెంటనే భయబ్రాంతులకు గురైన పాక్, మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)తో చర్చలకు దిగిందని తెలిపారు.
భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులను గాల్లోనే పేల్చేశాయని, దీన్ని యావత్ ప్రపంచం చూసిందని మోదీ గర్వంగా చెప్పారు.
భారత ఆర్మీ ప్రతీకార దాడుల్ని చూసి పాకిస్థాన్ వెనుకడుగేసిందన్నారు. "ఆపరేషన్ సింధూర్" ఎలాంటి సాధారణ ఆపరేషన్ కాదని, అది యావత్ భారతదేశ ప్రజల ఆవేశానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్‌లో సైనికులు ప్రదర్శించిన ధైర్యాన్ని మోదీ అభినందించారు.
Details
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే గుణపాఠం చెబుతాం
పహల్గామ్ ఘటనపై స్పందించిన ప్రధాని, తమ కళ్లముందే సొంత వారిని అత్యంత చంపడంపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ అణు బ్లాక్‌మెయిలింగ్ ఇక సహించే ప్రసస్తే లేదన్నారు. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే, భారత్ గట్టి గుణపాఠం చెబుతున్నారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా భారత్ అంతం చేస్తుందని మోదీ ప్రసంగించారు.