తదుపరి వార్తా కథనం
Delhi blast: 'దేశం మొత్తం దాడులు ప్లాన్ చేశాం'.. అంగీకరించిన ఉగ్ర డాక్టర్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 22, 2025
12:12 pm
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒక కీలక విషయం బయటపడింది. జైషే ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ దేశవ్యాప్తంగా దాడులకు కుట్రపన్నినట్లు సమాచారం. 2023లోనే ఈ ప్రణాళిక రూపొందించినట్లు బాంబు పేలుడు కేసులో అనుమానితుడు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఈ వివరాలను దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.