LOADING...
CM Vijay First Orders: 'చెప్పిందే చేస్తాం'.. సీఎం విజయ్ తొలి సంతకం ఆ ఫైల్‌పైనే!
'చెప్పిందే చేస్తాం'.. సీఎం విజయ్ తొలి సంతకం ఆ ఫైల్‌పైనే!

CM Vijay First Orders: 'చెప్పిందే చేస్తాం'.. సీఎం విజయ్ తొలి సంతకం ఆ ఫైల్‌పైనే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. చెన్నైలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం హోదాలో ఆయన తొలి సంతకాలు చేశారు. ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించే ఫైల్‌పై విజయ్ మొదటి సంతకం చేశారు. అలాగే రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక యాంటీ డ్రగ్ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు దస్త్రాలపై, మహిళల భద్రత కోసం ప్రత్యేక దళం ఏర్పాటు సంబంధించిన ఫైళ్లపై కూడా ఆయన సంతకాలు చేశారు. ఈ సందర్భంగా విజయ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. తమిళనాడులో ఇప్పుడు ప్రజల ప్రభుత్వం ఏర్పడిందని, రాష్ట్రంలో లౌకిక, సామాజిక, న్యాయ శకం ప్రారంభమైందని అన్నారు.

వివరాలు

హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాలి

ఒక దర్శకుడి కుమారుడిగా ప్రారంభమైన తన ప్రయాణం ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. "నేను మీ అందరివాడిని" అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, తనను చాలా మంది అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని విజయ్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాలని ప్రజలను కోరారు. గత డీఎంకే ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందని ఆరోపించారు. అయినప్పటికీ తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను తప్పకుండా సాధిస్తామని స్పష్టం చేశారు.

వివరాలు

ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

"సాధ్యమయ్యేవే చెబుతాం.. చెప్పిందే చేస్తాం.. విజయ్ మామ అన్ని మంచి పనులు చేస్తాడు" అంటూ ఆయన పవర్‌ఫుల్‌గా ప్రసంగించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మిత్రులైనా, శత్రువులైనా అందరికీ తమ ప్రభుత్వంలో ఒకే చట్టం వర్తిస్తుందని విజయ్ స్పష్టం చేశారు. బంధుప్రీతికి తమ ప్రభుత్వంలో స్థానం ఉండదని తేల్చిచెప్పారు. టీవీకే పార్టీలో ఒకే ఒక అధికార కేంద్రం ఉందని, అదే విజయ్ అని వెల్లడించారు.

Advertisement