Page Loader
'ఏకే 47తో చంపేస్తాం'; సంజయ్ రౌత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
'ఏకే 47తో చంపేస్తాం'; సంజయ్ రౌత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరిపంపు

'ఏకే 47తో చంపేస్తాం'; సంజయ్ రౌత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు

వ్రాసిన వారు Stalin
Apr 01, 2023
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్‌కు చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. రౌత్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించినట్లు ముంబయి పోలీసులు శనివారం తెలిపారు. ఈ విషయమై రౌత్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని, దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. సిద్ధూ మూస్‌ వాలాను కలుసుకుంటావని, దిల్లీలో కలిస్తే ఏకే 47తో చంపేస్తామని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి వచ్చిన మెసేజ్‌లో ఉందని పోలీసులకు రాసిన లేఖలో సంజయ్ రౌత్‌ పేర్కొన్నారు.

ముంబయి

సల్మాన్ ఖాన్‌కు కూడా ఇలాంటి బెదిరింపులు

అయితే రౌత్‌కు బెదిరింపు సందేశం వచ్చిన ఫోన్ నంబర్‌ను పోలీసులు గుర్తించే పనిలో నిమగ్నయ్యారు. అంతకుముందు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను కూడా సిద్ధూ మూస్ వాలా లాగా అంతం చేస్తానని బెదిరింపులు వచ్చాయి. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా లుని నివాసి అయిన ధాకద్ రామ్ అనే నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. సల్మాన్ ఖాన్ ముప్పు ఉందని గుర్తించిన ముంబై పోలీసులు ఖాన్‌కు Y+ కేటగిరీ భద్రతను అందించారు.