
మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం
ఈ వార్తాకథనం ఏంటి
శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం ఎంపీ సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నుంచి తనకు ప్రాణహాని ఉందని నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించిన ఒక రోజు తర్వాత, థానే పోలీసులు అతనిపై పరువు నష్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
థానే మాజీ మేయర్ మీన్‌కాషి షిండే ఫిర్యాదు మేరకు థానేలోని కపూర్‌బావడి పోలీసులు సంజయ్ రౌత్‌పై కేసు నమోదు చేశారు.
ఎంపీ శ్రీకాంత్ షిండేపై రౌత్ చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆమె ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కల్యాణ్ లోక్ సభ నియోజకవర్గానికి శ్రీకాంత్ షిండే ప్రాతినిధ్య వహిస్తున్నారు.
శివసేన
సంజయ్ రౌత్ ఆరోపణలను ఖండించిన ఫడ్నవీస్
శ్రీకాంత్ షిండే తనను హత్య చేసేందుకు థానేకు చెందిన రాజా ఠాకూర్‌కు కాంట్రాక్ట్ ఇచ్చారని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. థానే పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఆ లేఖను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు కూడా పంపారు.
అయితే రౌత్ ఫిర్యాదుపై స్పందించిన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హామీ విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.
సంజయ్ రౌత్ ఆరోపణలను ఫడ్నవీస్ ఖండించారు. సానుభూతి పొందేందుకు రౌత్ ప్రయత్నిస్తున్నారని, బుద్ధిలేని ఆరోపణలు చేస్తున్నారని ఫడ్నవీస్ అన్నారు.
రౌత్ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించాలని ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, ఆదిత్య ఠాక్రే డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే కాల్పులు జరిపినా పట్టించుకోలేదన్నారు.