గూగుల్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు- హైదరాబాద్‌లో వ్యక్తి అరెస్ట్
మహారాష్ట్ర పుణె నగరంలోని గూగుల్ కార్యాలయానికి సోమవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారించగా అది ఫేక్ కాల్ అని తేలింది. కాల్ చేసిన వ్యక్తిని హైదరాబాద్‌లో గుర్తించి తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడిని ముంబయి పోలీసు బృందం తెలంగాణకు బయలుదేరింది. నిందుతడి దగ్గర దగ్గర పుణెలోని గూగుల్ ఆఫీస్ నంబర్ లేకపోవడంతో ముంబయిలోని గూగుల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్‌కు ఫోన్ చేసి బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు.
కాల్ చేసిన వ్యక్తిని పనయం శివానంద్‌గా గుర్తింపు
బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే ముంబయి పోలీసులు వెంటనే పుణె పోలీసులకు సమాచారం అందించారు. రెండు బృందాలు పూణేలోని ముంధ్వా ప్రాంతంలోని గూగుల్ ఆఫీస్‌కు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఎలాంటి ఆచూకీ కనిపించలేదు. దీంతో దీన్ని ఫేక్ కాల్‌గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాల్ చేసిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన పనయం శివానంద్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పనయం శివానంద్‌పై ముంబయిలోని బీకేసీ పోలీస్ స్టేషన్‌లో గూగుల్ ఫిర్యాదు చేసింది. అతని కింద ఐపీసీ సెక్షన్ 505(1)(బీ), 506(2) కింద కేసు నమోదు చేశారు.