
Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆధునిక యుగంలో కూడా మూఢనమ్మకాలు పెచ్చరిల్లుతున్నాయి. కొడలికి పిల్లలు పుట్టడం లేదని దారుణానికి ఒడిగట్టారు ఓ మహిళ అత్తమామలు. తాంత్రికుడు చెప్పిన మాటలు విని కొడలితో శ్మశానంలోని ఎముకలు, వాటి పొడిని తినిపించారు. మహారాష్ట్రలోని పుణెలో ఈ దారుణం జరిగింది.
2019లో పెళ్లైన ఆ మహిళకు ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. ఈ క్రమంలో అత్తమామలు ఒక తాంత్రికుడిని సంప్రదించారు. ఈ క్రమంతో అతను ఏది చెబితే, ఆ మహిళతో చేయించారు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించి, తనతో చేయిస్తున్న వికృత చేష్టలను వివరించింది.
పుణె
అమావాస్య రాత్రుల్లో మహిళతో బలవంతంగా క్షుద్ర పూజలు
అనేక అమావాస్య రాత్రుల్లో ఆ మహిళతో అత్తమామలు ఇంట్లోనే రకరకాల క్షుద్ర పూజలు చేయించారు. ఆమె ఒప్పుకోకపోయినా, బలవంతంగా ఆమెతో పూజలు చేయించారు.
పలుమార్లు ఆమెను వివిధ శ్మశాన వాటికలకు తీసుకెళ్లి బలవంతంగా ఎముకల పొడిని తినిపించేవారు. బతికున్న కోడి తల, కాళ్లను కూడా తనతో బలవంతంగా తినిపించారని ఆమె ఆరోపించింది. తాను తినను అంటే తుపాకీతో బెదిరించి మరీ తినిపించారని ఆ మహిళ పోలీసులను చెప్పింది.
దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మూఢనమ్మకాల నిరోధక చట్టంలోని సెక్షన్ 3తో పాటు 498 ఏ,323,504, 506 కింద పోలీసులు కేసునమోదు చేశారు. ఆ మహిళ అత్తమామలు పరారీలు ఉన్నట్లు పూణే సిటీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుహైల్ శర్మ తెలిపారు.